Viral Video : రూడ్లపై బైక్స్ మీద యువత చేసే విన్యాసాలు చూస్తూనే ఉంటాం కదా. కొందరైతే రద్దీ రూడ్లపై బైక్ రేసింగ్ లు పెట్టుకుంటారు. ట్రాఫిక్ ఉన్న రోడ్ల మీదే తమ ప్రతాపం చూపిస్తూ ఉంటారు. స్పోర్ట్స్ బైక్స్ తో రోడ్ల మీద వీళ్లు చేసే రచ్చ మామూలుగా ఉండదు. వాళ్ల వల్ల ఇతర వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బందే కానీ.. ఏం చేస్తారు. వాళ్లకు ఎంత చెప్పినా వినే టైప్ కాదు కదా. అందుకే వీళ్ల బైక్స్ స్టంట్స్ ను చూసి చూడనట్టు ప్రయాణికులు కూడా వదిలేస్తూ ఉంటారు.

వాళ్ల బైక్ స్టంట్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్లు కూడా వామ్మో ఏంటి ఈ స్టంట్స్ అంటూ షాక్ అవుతుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇటువంటి వాళ్లకు ఇలాగే జరగాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video : ఒకే బైక్ పై ముగ్గురు స్టంట్
ముగ్గురు యువకులు ఒకే బైక్ పై వెళ్తున్నారు. ఆ బైక్ పై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నారు. స్టంట్స్ చేస్తున్నారు. ఇంతలో బైక్ స్కిడ్ అయింది. రోడ్డు మీద ముగ్గురూ పడిపోయారు. ఇంతలో వెనక నుంచి ఇతర బైక్స్ కూడా వస్తున్నాయి. బైక్ నుంచి కింద పడ్డాక లేచి రోడ్డు పక్కకు వెళ్లబోగా.. వెనుక నుంచి వచ్చిన మరో బైక్ వాళ్లను ఢీకొట్టింది. దీంతో మరో వ్యక్తి ఎగిరి కిందపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
How unlucky 👇👇👇 pic.twitter.com/YKaAWry690
— 24/7vids🎬🎭📽️ (@mrwhite321) August 18, 2022
అసలే లైఫ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు ఇలా పిచ్చి స్టంట్స్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు అంటూ నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.