Devotional : భోజనం ఇలా చేస్తే దరిద్రం, కానీ భోజనం ఇలా చేశారంటే.

Devotional : భోజనం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటారు. కానీ ఈ రోజుల్లో ఫోన్లు ,టీవీలు చూస్తూ మంచాలపై కూర్చొని భోజనం చేస్తున్నారు. కానీ ఈ విధంగా తినడం వల్ల కొన్ని వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. అన్నపూర్ణాదేవి స్వరూపమైన భోజనాన్ని ఎంతో పవిత్రంగా భుజించాలి. కానీ భోజనాన్ని ఎలా తింటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనానికి ముందు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని భోజనానికి సిద్ధం కావాలి.

Advertisement

అలాగే ముగిసిన తర్వాత కూడా అదే పద్ధతిని పాటించాలి. భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం దిక్కు వైపు కూర్చొని తినడం చాలా మంచిది. భోజనం చేసేటప్పుడు మధ్యలో లేవటం వంటివి చేయకూడదు. ఎవరైనా వచ్చినా సరే భోజనం మధ్యలో నుంచి లేసి ఎంగిలి చేతితో ఆ వస్తువుని లేదా ఆ పదార్థాన్ని ముట్టకూడదు. నిలబడి అన్నం తిన్నా సరే పరమ దరిద్రులు అవుతారు. భోజనం మొదటి ముద్ద కళ్ళకు అద్దుకొని భగవంతుని నామాన్ని స్మరణ చేస్తూ భోజనం అయినంత వరకు మాట్లాడకుండా తినడం మంచిది. కొందరు భోజనం చేస్తూ ఇది రుచిగా లేదు అంటూ కోపగిస్తారు.

Advertisement

Devotional : భోజనం ఇలా చేస్తే దరిద్రం, కానీ భోజనం ఇలా చేశారంటే.

If you eat like this, you will be poor, if you eat like this, it will be better
If you eat like this, you will be poor, if you eat like this, it will be better

కానీ ఇలా చేయకూడదు. కంచాని ఒడిలో పెట్టుకొని భోజనం చేయకూడదు. అలాగే పడుకునే బెడ్ మీద కూర్చొని భోజనం చేయడం ఉత్తమం కాదు. కొందరు కంచాన్ని నాకేస్తున్నట్లు ఊడ్చుకొని తింటుంటారు. కానీ ఇలా చేయడం మేలు కాదు. మరికొందరు వండిన పదార్థాలు ఫ్రిజ్లో పెట్టి వేడి చేస్తూ తింటుంటారు. ఇలా చేసినట్లయితే ద్విపాక దోషం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒకరు తిన్న వెంగిలి ప్లేట్లో మరొకరు తినకూడదు. కానీ నేల మీద కూర్చొని భోజనం చేయడం శ్రేయస్కరం.

Advertisement