Sai Pallavi : పుష్ప 2 ‘ లో సాయి పల్లవి… బన్నీతో జోడి కట్టనుందా…

Sai Pallavi : అల్లు అర్జున్ నటిస్తున్న ‘ పుష్ప 2 ‘ సినిమా షూటింగ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దాదాపుగా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. తొలిభాగానికి మించి బెస్ట్ మ్యూజిక్ ను దేవి శ్రీ ప్రసాద్ అందించే పనిలో ఉన్నారు. ఆయనతోపాటు దర్శకుడు సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు విదేశాల్లో సంగీతం పనులు చేస్తున్నారు. మరోవైపు ‘ పుష్ప 2 ‘ కాస్టింగ్ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. రెండవ భాగంలో చాలా కొత్త పాత్రలు వస్తాయని మొదటి భాగానికి కొనసాగింపైన సుకుమార్ రెండవ భాగంలో సరికొత్త పాత్రలతో కథను నడిపించునున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఇప్పటికే శ్రీవల్లి పాత్ర రెండవ భాగంలో చనిపోతుందని ఆ పాత్ర స్థానంలో మరో హీరోయిన్ కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సాయి పల్లవి పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే మరికొన్ని బలమైన పాత్రలు సైతం తెరపైకి కనిపించనున్నాయని సమాచారం. మరి ఇందులో ఏది నిజం అన్నది క్లారిటీ లేదు. తాజాగా మరోసారి సాయి పల్లవి పేరు బలంగానే వినిపిస్తుంది. ‘ పుష్ప 2 ‘లో సాయి పల్లవి చిత్తూరు అడవుల్లో కనిపించే గిరిజన యువతి క్యారెక్టర్ లో కనిపించనుందని అంటున్నారు. ఎర్రచందనం స్పగ్లర్ పుష్ప రాజ్ కు చిత్తూరు అడవుల్లో ఈ పాత్ర ఎదురుపడుతుందంట. ఆ పాత్రతో బన్నీ కొత్త ప్రేమాయణం మొదలవుతుందని టాక్. అయితే ఆ ప్రేమ పూర్తిస్థాయిలో కనిపించదని కేవలం 20 నిమిషాల్లో ఆ పాత్ర ఉంటుందని అంటున్నారు.

Advertisement

Sai Pallavi : పుష్ప 2 ‘ లో సాయి పల్లవి… బన్నీతో జోడి కట్టనుందా…

Sai pallavi act in pushpa 2 movie
Sai pallavi act in pushpa 2 movie

సాయి పల్లవి ఎలాంటి మేకప్ లేకుండానే సుకుమార్ తెరపైకి తీసుకొస్తారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందో చిత్ర బృందమే క్లారిటీ ఇవ్వాలి. నిజంగా ఇలాంటి పాత్రని సుకుమార్ సృష్టిస్తే కనుక ఆ పాత్రకి సాయి పల్లవి జీవం పోస్తుందని చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సాయి పల్లవి ‘ విరాటపర్వం ‘ సినిమాలో వెన్నెల పాత్ర చేసి అందరిని ఆకట్టుకుంది. ఎంతో న్యాచురల్ గా నటించింది. అంతగా ఆ పాత్రలో లీనమై ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సాయి పల్లవి వేరువేరు సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement