Viral Video : ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు ఇది.. ఎక్కడుందో తెలుసా? దీని విశిష్టత ఏంటో తెలుసా?

Viral Video : ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వును చూశారా ఎప్పుడైనా? ఏంటి.. ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వా.. ఎక్కడుంది అంటారా? అక్కడికే వస్తున్నా. ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు పేరు రఫ్లెసియా అర్నోల్డీ. ఇది ఇండోనేషియాలో ఉంది. అక్కడ ఉన్న అడవిలో ఈ పువ్వు ఉంది. ఓ వ్యక్తి ఇండోనేషియాలోని అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా మనోడికి ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు కంటబడింది. దీంతో వెంటనే ఆ పువ్వు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
the largest flower in the world found in indonesia
the largest flower in the world found in indonesia

ఇండోనేషియాలోని రెయిన్ ఫారెస్ట్ లో ఈ పువ్వు ఉంది. ఈ పువ్వు మూడు ఫీట్ల వరకు పెరుగుతుంది. దాదాపు 15 పౌండ్ల బరువు ఉంటుంది. అంటే సుమారు 20 కిలోల బరువు అన్నమాట. చూడటానికి ఈ పువ్వు మిక్స్ డ్ ఎరుపు, మెరూన్ కలర్ లో ఉంటుంది. కానీ.. దీన్ని రెడ్ ఫ్లవర్ అనే పిలుస్తారు. దాని చుట్టూ ఐదు ఆకులు ఉంటాయి. లోపల ఒక రంధ్రంలా ఉంటుంది.

Advertisement

Viral Video : దీని వాసన మాత్రం భరించలేం

ఈ పువ్వు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పువ్వు. ఈ పువ్వు కొన్ని రోజులు మాత్రమే పూస్తుంది. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పూస్తుంది. ఆ తర్వాత వాడిపోతుంది. కానీ దీన్ని అక్కడ కార్ప్స్ ఫ్లవర్ అని పిలుస్తారు. అంటే దెయ్యం పువ్వు అన్నమాట. ఎందుకంటే.. దీని నుంచి వచ్చే వాసన అంత ఘోరంగా ఉంటుంది. ఆ వాసనను భరించలేం. చనిపోయిన శవం వాసనను ఇది వెదజల్లుతుంది. అందుకే దీనికి కార్ప్స్ ఫ్లవర్ అనే పేరు వచ్చింది. మొత్తానికి ఈ ఫ్లవర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement