Viral Video : వీడియో కోసం మానవత్వాన్ని మర్చిపోయిన యజమాని… గేదె ప్రాణాలనే పణంగా పెట్టాడు…

Viral Video  : పాములంటే కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా చాలా భయం. అందుకే ప్రతి జీవి పాములతో చాలా జాగ్రత్తగా ఉంటాయి. పెద్ద పెద్ద జంతువులు సైతం పాములను చూసి భయపడక తప్పదు. ఎందుకంటే పాముకాటుకు గురైతే వెంటనే చనిపోతాయని వాటికి కూడా తెలుసు. ఈ క్రమంలోనే పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ చిరుత పులి కూడా పామును చూసి భయపడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఒక గేదె పామును చూసి భయపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అదే సమయంలో గేదెను కాపాడాల్సిన యజమాని వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో ఈ వీడియో చూసిన నేటిజననులు యజమానిపై మండిపడ్డారు. పూర్తి వివరాలకు వెళ్తే…

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చెట్టుకు గేదెను కట్టేసి ఉంచారు. అదే సమయంలో అక్కడకు వేగంగా ఓ పాము దూసుకొచ్చింది. దీంతో పామును చూసిన గేదె బెదిరిపోయింది. అయితే గేదెను కట్టేసి ఉండటం వలన తప్పించుకోలేక సతమతమవుతుంది. అయితే పక్కనే ఉన్న యజమాని దానిని కాపాడాల్సింది పోయి వీడియో తీస్తూ ఎంజాయ్ చేయసాగాడు. చివరకు పాము గేదెకు ఎలాంటి హాని తలపెట్టకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. అయితే కాపాడాల్సిన యజమాని ఇలా వీడియో తీయడంతో సోషల్ మీడియాలో ఇతనిపై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. దీంతో వీడియో కాస్త వైరల్ గా మారింది.

Advertisement

ఇక ఈ వీడియోను @tiptopyatra అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి పోస్ట్ చేయగా ఇప్పటివరకు ఈ వీడియోని 9.5 లక్షల మంది వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో తీస్తున్న వ్యక్తికి హృదయమనేది లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే..సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు వీడియో కోసం అతను మానవత్వాన్ని మరిచిపోయాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే గేద అదృష్టం బాగుందంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Tip Top Yatra (@tiptopyatra)

Advertisement