Ravi Krishna : బుల్లితెర నటుడు,బుల్లితెర ప్రభాస్ గా పేరు తెచ్చుకున్న రవికృష్ణ జీవితంలోని కొన్ని విషయాలు

Ravi Krishna : రవికృష్ణ 1983 మార్చ్ 2 న జన్మించాడు. రవికృష్ణ విజయవాడకు చెందిన అబ్బాయి.రవికృష్ణ ది ఒక మధ్య తరగతి కుటుంబం, వాళ్ళ నాన్న ఆర్టీసీ ఉద్యోగి. స్కూల్లో చదువుకునే రోజుల్లో నుంచే నటనపై ఇంట్రెస్ట్ ఉండేది రవికృష్ణకి. అందుకే స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్లో పాటిస్పేట్ చేసే వాడు. రవికృష్ణ తన డిగ్రీ పూర్తి చేశాక నటన వైపు వెళతాను, అని వాళ్ళ తండ్రిని అడిగాడు. అప్పుడు వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. కానీ వాళ్ల మేనమామ ప్రోత్సాహంతో, రవికృష్ణ చెన్నై వెళ్లాడు, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ను ప్రారంభించాడు.

Advertisement

అక్కడ కొన్ని రోజులు చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చి అవకాశాల కోసం ప్రయత్నించాడు. అప్పుడు ఈటీవీ లోని హృదయం సీరియల్ లో అవకాశం వచ్చింది . ఆ సీరియల్ తో తొలిసారిగా నటించాడు రవికృష్ణ , కానీ అది కొద్ది ఎపిసోడ్స్ తోటే పూర్తయింది. దాని తర్వాత బొమ్మరిల్లు సీరియల్లో హీరోగా కొన్ని ఎపిసోడ్లు నటించాడు. తర్వాత భార్యామణి సీరియల్ లో చిన్న రోల్ లో కూడా చేశాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో, సీరియల్ దర్శకుడు సంజీవ్ రెడ్డి గారి దగ్గర మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఆ సమయంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు.

Advertisement

Ravi Krishna : రవికృష్ణ జీవితంలోని కొన్ని విషయాలు

intresting facts about seriel hero ravi krishana and his Biography
intresting facts about seriel hero ravi krishana and his Biography

తన నటనను చూసిన ఒకతను మొగలిరేకులు సీరియల్ ఆడిషన్స్ జరుగుతున్నాయి, వెళ్లమని చెప్పాడు.మొదట్లో రవికృష్ణ భయపడ్డాడు. ఎనిమిది వందల మందిలో సెలక్ట్ అవుతానా లేదా అని, కానీ ఆ సీరియల్స్కి సెలెక్ట్ కావటంతో, తన లైఫ్ మారిపోయింది. అప్పటి నుంచి తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మారిపోయింది. ఇలా రెండేళ్లు మొగలిరేకులు చేశాక, జీ తెలుగులో వరుాధిని పరిణయం సీరియల్ లో అవకాశం వచ్చింది. తన కెరియర్లో ఎన్ని సీరియల్స్ చేసినా, తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన సీరియల్ మాత్రం వరుాధిని పరిణయం అని చెప్పొచ్చు.

ఈ సీరియల్ తో బుల్లితెర రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రవికృష్ణ. తరవాత మాటీవీ లోని శ్రీనివాస కల్యాణంలో తన పాత్రతో మంచి పేరుని సంపాదించుకున్నాడు.ఆ తర్వాత అప్పటికే లీడ్లో ఈటీవిలో దూసుకుపోతున్న మనసు మమత సీరియల్లో అవకాశం వచ్చింది. మొదట సింగిల్ రోల్ అని చెప్పి, తరువాత డ్యూయల్ రోల్ చేసాడు. దాంతో తన పేరు మారుమోగింది. బుల్లితెర ప్రభాస్ గా కూడా పేరుతెచ్చుకున్న, రవికృష్ణ బిగ్బాస్ 3 లోకి వెళ్లి అలరించాడు, అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.

దాని తరువాత నవ్యస్వామి తో జతకట్టి, ఆమె కథ సీరియల్లో అలరించారు. దాంతో తను నెగిటీవ్ షేడ్స్ లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇలా డీ షో లొ కూడా నవ్యస్వామి పక్కన నటించి, మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత అనుభవించు రాజా సినిమాలో హీరోకి ఫ్రెండ్ పాత్రలో నటించి, మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలా ఇంకా కొన్ని సినిమాల్లో కూడా నటించబోతున్నాడు. తను లైఫ్లో మరింత సక్సెస్ కావాలని, తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

Advertisement