Karthika Deepam 30 August Today Episode : డాక్టర్ బాబుకి గతం గుర్తొచ్చేలా చేస్తా అని శబదం చేస్తున్న దీప… ఈ జన్మకి కార్తీక్ నా భర్త అంటున్న మోనిత…

Karthika Deepam 30 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1444 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప సౌందర్యకు వాళ్లకి ఫోన్ చేసి బ్రతికే ఉన్నామని చెప్పాలి అనుకుంటుంది. కానీ నా దగ్గరఫోన్ నెంబర్ లేదు. వాళ్లేమో ఇక్కడ లేకుండా అమెరికాకి వెళ్లిపోయారు అని ఆలోచిస్తూ… ముందు డాక్టర్ బాబు ని దగ్గరికి వెళ్లి తనకి చెప్తే తనే అంతా చూసుకుంటాడు అని అనుకుంటూ. ఉంటుంది. మౌనిత కార్తీక్ కి గతం గుర్తుకొస్తుందో ఏమో అని కంగారు పడుతూ.. కార్తీక్ ని చూస్తూ ఎందుకు మన ప్రేమకి ఇన్ని అడ్డంకులు ఆ దీప మనల్ని వదలద.. అది యాక్సిడెంట్లో చచ్చిందిలే అని అనుకుంటే మళ్ళీ బ్రతికి వచ్చి నీ ఫోటో పట్టుకొని వెతుకులాడుతుంది.  అది మామూలు కాదు ఇప్పుడు కాకపోయినా ఏనాటికైనా ఈ నిజం తెలుసుకుంటుంది.

Advertisement

Karthika Deepam 30 August Today Episode : ఈ జన్మకి కార్తీక్ నా భర్త అంటున్న మోనిత…

నా నుంచి నిన్ను ఎవరు దూరం చేయలేరు అనుకుంటూ కార్తీక్ ని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే సౌందర్య మోనిత గురించి తన ప్రవర్తన గురించి అనుమానం వస్తుంది. తన ఎందుకు అలా చేస్తుంది. నేను కనిపెడతాను అధి కంగారు పడటం వెనుక ఏదో తప్పు ఉంది అని ఆనందరావుతో చెబుతుంది. కట్ చేస్తే కార్తీక్ శివ ఇద్దరు కలిసి బయటికి వస్తారు.. అంతలో దీప అక్కడికి వస్తుంది. కార్తీక్ కారు దిగి నడుస్తూ ఉండగా.. శివ సార్ రండి సార్ కార్లో వెళ్దాం.. అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అంతలో దీప తనని చూసి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుండగా… వాళ్లు కార్లో వెళ్లిపోతారు. అప్పుడు దీప ఆ కారు వెనక ఫాలో అవుతూ ఉంటు.. మధ్యలో డాక్టర్ కి ఫోన్ చేసి అన్నయ్య నేను కార్తీక్ దగ్గరికి వెళుతున్నాను.. తనని తీసుకొని వస్తాను అమ్మకు చెప్పు అని అంటాడు. కట్ చేస్తే సౌర్య ఆటో మీద అమ్మ నాన్నలు ఎక్కడున్నారు అనే పేర్లను తుడుస్తూ బాధపడుతూ ఉండగా.. అంతలో అక్కడికి వారణాసి వస్తాడు. అప్పుడు శౌర్య మళ్లీ తాతయ్య పంపించాడ.. అని అడుగుతుంది.

Advertisement
Karthika Deepam 30 August Today Episode
Karthika Deepam 30 August Today Episode

లేదమ్మా నేనే వచ్చాను ఇక ఇక్కడే ఉంటాను అని అంటాడు. అప్పుడు సౌర్య బాబాయ్ పిన్నిని పిలిచి మా మామయ్య అని పరిచయం చేస్తుంది. కట్ చేస్తే దీప కార్తీక్ ని ఫాలో అవుతూ మౌనిత ఇంటికి వస్తుంది. కార్తీక్ లోపలికి వెళ్తుండగా.. దీప తన దగ్గరికి వచ్చి డాక్టర్ బాబు అని తనని పట్టుకో పోతుండగా.. ఆగు ఆగు నేను నీకే ఎప్పుడైనా చిట్టి రాశానా, సూది గుచ్చానా ప్రతిసారి డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని పిలుస్తూ ఉంటాం ఏంటి అని అంటుండగా… అంతలో మౌనిత బయటికి వస్తు ఎవరు కార్తీక్ అని అంటుంది. అప్పుడు దీప మౌనికాని చూసి ఆగ్రహంతో నేను అనుకున్నానే నా డాక్టర్ బాబు నీ దగ్గరే ఉంటాడని మళ్లీ నాకు అనుమానం రాకుండా ఫోటో పట్టుకొని తిరుగుతున్నావా… అయినా డాక్టర్ బాబు మీరు దీని మాయలో ఎలా పడ్డారు. అంటూ పదండి వెళ్దామని కార్తీక్ని తీసుకెళ్తూ ఉండగా.. మౌనిత వచ్చి నువ్వు ఎవతివే నా కార్తీక్ వెంటపడ్డావు… అని కార్తీక్ ని తీసుకెళుతుండగా..

ఒక్క అడుగు లోపలికి వేసిన నిన్ను చంపి మరీ తీసుకెళ్తా నా డాక్టర్ బాబుని అని అంటుంది. అప్పుడు మౌనిత, శివ ఆమెను బయటికి పంపించు అనగానే శివ తను చేయి పెట్టుకొని తీసుకెళ్తుండగా.. కార్తీక్ ఆగు నువ్వు ఏమని పిలిచావు మౌనిత అనేగా అంటే ఆవిడ ఎవరు నీకు తెలుసా.. అంటే ఆమెకి నువ్వు తెలిసినప్పుడు నేను కూడా తెలిసే ఉండాలి కదా.. నన్ను డాక్టర్ బాబు అంటుంది. నిన్ను మౌనిత అంటుంది. అసలు ఆవిడ ఎవరు? నువ్వు ఎవరు? నేనెవరు అని అంటాడు. అప్పుడు మౌనిత ఇలా డబ్బులు కోసం ఇలా నటిస్తూ ఉంటారు కార్తీక్ అని చెప్తుంది. అప్పుడు దీప ఎవరి డబ్బులు కోసం చేసేది నా భర్త కోసం నా మాంగల్యం కోసం వచ్చాను నేను అని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లు ప్రమాదం జరగకముందు నీ భర్త ప్రమాదం జరిగిన తర్వాత ఈ జన్మలో నా భర్త అని దీపకు చెప్తుంది మోనిత. అప్పుడు దీప నా డాక్టర్ బాబు నా దగ్గరికి వస్తాడు.. అప్పటివరకు జాగ్రత్తగా చూసుకో అని సంతోషంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..

Advertisement