Devotional : ఈరోజు పూజ చేస్తున్న సరే ఆరోజు దైవానికి ఇష్టమైన ముగ్గును వేసి భగవంతుని పూజించాలి. ఇంటి ముందు వేసే ముగ్గులు సైడు రెండు గీతలు ఇంటిలోకి దుష్టశక్తులను రానీకుండా నిరోధిస్తాయి. గృహములో ఉన్న లక్ష్మీదేవిని బయటకు వెళ్లకుండా చూస్తాయి. ముగ్గు వేసిన తరువాత దానికి ఇరువైపులు నాలుగు అడ్డగీతలు వేస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతాయని నమ్మకం. శుభకార్యాలలో, పండగ సమయంలో ఈ విధంగా కచ్చితంగా ముగ్గు వేయాలి. ఏ దేవత పూజ చేస్తున్న దైవాన్ని పెంచే పీఠ మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులు రెండేసి గీతలు తప్పకుండా గీయాలి. నక్షత్రం ఆకారం వచ్చేలా వేసే ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఇంటి లోపలికి రాకుండా చూస్తుంది.
అంతేకాకుండా మనం వేసే పద్మాలు ,చక్రాలు ,చుక్కల ముగ్గులు కూడా మనకి తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి. అవి గీతలే కాదు యంత్రాలు కూడా, యంత్ర ,తంత్ర ,శాస్త్ర రహస్యలతో కూడి ఉండడం వల్ల ఈ ముగ్గులు మనకి హాని కలిగించే చెడిశక్తులను దూరం చేసేందుకు సహాయపడతాయి. అందుకే గుమ్మం ముందు ఉన్న ఏ ముగ్గు నైనా తొక్క కూడదు. తులసి చెట్టు దగ్గర అష్టదళపద్మం వేసి దీపరాధన చేయాలి. యజ్ఞగుండం మీద నాలుగు గీతాలతో కూడిన ముగ్గులు వేయాలి. దైవకార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. కొత్తగా పెళ్లయిన వారి వధువు , వరుడు తొలిసారిగా భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లలిత, పుష్పాలు ,తీగలతో కూడిన ముగ్గులు వేయాలి. దేవత రూపాలు కలిగిన, ఓం స్వస్తిక్ ,శ్రీ ,గుర్తులను పోలిన ముగ్గులను వేయకూడదు. ఒకవేళ వేసిన తొక్క కూడదు. ఏ స్రీ అయితే దేవాలయంలో అమ్మవారి శ్రీ మహావిష్ణువు ముందు రోజు ముగ్గులు వేస్తుందో.
Devotional : ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు తెలుసా..?

ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యన్ రాదని, సుమంగళి గా మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. రోజు ఇంటి ముందు వెనక భాగంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ ఎనర్జీని ఇంటి లోపలికి ఆకర్షిస్తుంది. పూర్వం రోజుల్లో సాధువులు, సన్యాసులు ,బ్రహ్మచారులు ఇల్లు తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందు అయితే ముగ్గు కనిపించదు ఆ ఇంటికి వెళ్లేవారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ ఆ శుభం జరుగుతుందని నమ్మకం. అందుకే మరణించిన వారికి శ్రద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రద్ధ కర్మ అయిన తరువాత వెంటనే ముగ్గు వేస్తారు. ముగ్గులు అనేక సామాజిక ,మానసిక ఆరోగ్య అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మనం ఆచరించే ఏ సంప్రదాయం, మూఢనమ్మకం కాదు. మనం పాటించి ఆచార సంప్రదాయాలు అనేక అర్ధాలు.